![]() |
![]() |
.webp)
కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ నెక్స్ట్ వీక్ ప్రోమో ఫుల్ కలర్ ఫుల్ గా రిలీజ్ అయ్యింది. ఐతే లవ్ థీమ్ కాన్సెప్ట్ తో నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ రాబోతోంది. ఇందులో కంటెస్టెంట్స్ జోడీస్ గా కనిపించారు. మానస్ - డెబ్జానీ జోడిగా వచ్చేసరికి యాంకర్ శ్రీముఖి షాకయ్యింది. "ఏంటి నువ్వు జోడిగా వచ్చావు" అని అడిగింది. "మొత్తం సీజన్ సింగల్ సింగల్ గా పోటీ చేస్తే మీలాగా మొత్తం లైఫ్ కూడా సింగల్ గా మిగిలిపోతుంది" అంటూ శ్రీముఖి మీద కౌంటర్ వేసింది. "ఆమ్మో నాకే కౌంటర్ వేసిందా" అని తెలుసుకుని నవ్వుకుంది. తర్వాత ప్రేరణ - అంబటి అర్జున్ తో కలిసి జోడిగా వచ్చింది. ఈ జోడిని చూసి జడ్జ్ అనసూయ కామెంట్ చేసింది.
"ప్రేరణ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది కానీ అర్జున్ కాకపోతే బాగుండేది. కొన్ని కంబినేషన్స్ చాలా డెడ్లీగా ఉంటాయి" అని చెప్పింది. ఇక ఈ లవ్ థీమ్ షోకి నిఖిల్ మాత్రం సింగల్ గా వచ్చాడు. "నిఖిల్ అనే పర్సన్ సెకండ్ ఛాన్స్ ఇన్ లవ్ అనేది ఆయన సైడ్ నుంచి ఇస్తాడా, ఇవ్వడా ?" అంటూ శ్రీముఖి నిఖిల్ నే అడిగింది. "వై, ఎందుకు అనే దానికి రీజన్ దొరికితే" అంటూ ఎమోషనల్ అయ్యాడు. శ్రీముఖి వెంటనే "మనల్ని బాగా ఇబ్బంది పెట్టే ప్రాబ్లమ్ ని ఒక పేపర్ మీద రాసి దాని తగలబెట్టేస్తే భారం తీరిపోయినట్టు అనిపిస్తుంది" అంటూ చెప్పింది. నిఖిల్ కూడా వెంటనే తన ప్రాబ్లమ్ ని పేపర్ మీద రాసి దాని స్టేజి మీదనే తగలబెట్టేసాడు..నిఖిల్, కావ్య విడిపోయిన విషయం తెలిసిందే. వీళ్ళు కలిసి ఏ షోలోనూ కనిపించడం లేదు. ఎవరికీ వాళ్ళు విడిగా ఉంటున్నారు. అలాంటి నిఖిల్ ని శ్రీముఖి ఈ ప్రశ్న అడిగింది. మరి నిఖిల్ పూర్తి ఆన్సర్ ఎం ఇచ్చాడో తెలియాలి అంటే ఈ షో చూడాల్సిందే.
![]() |
![]() |